Navyamedia
Business News

Jio ఫోన్ ఉచితం

మొబైల్ వినియోగదారులకి శుభవార్త. ఆగష్టు నుండి జియో ఫోన్ ఉచితం.

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత  ముకేశ్ అంబానీ తమ కంపెనీ 40 వ వార్షికోత్సవ సందర్భం గా ఉచిత మొబైల్ ఫోన్ ఆఫర్ ని ప్రకటించారు. ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా  ఈ ఫోన్‌ను వినియోగదారులకు అందిస్తున్నట్లు తెలిపారు. అయితే ఈ ఫోన్‌ను బుక్ చేసుకోవాలంటే ముందు గా కొంత డిపాజిట్‌ చేయాల్సి ఉంటుంది. రూ.1500 సెక్యూరిటీ డిపాజిట్‌ చేస్తే ఆ మొత్తాన్ని మూడేళ్ల తర్వాత ఒకేసారి తిరిగి పొందవచ్చు. ఈ ఫోన్‌ ప్రీబుకింగ్స్‌ ఆగస్టు 24 నుంచి ప్రారంభమవుతుండగా.. సెప్టెంబర్‌లో ఇది అందుబాటులోకి రానుంది. వాయిస్‌ కమాండ్‌తో ఈ ఫోన్‌ పనిచేస్తుందని, 22 భాషలు సపోర్ట్‌ చేస్తుందని తెలిపారు.తర్వాత జియో ఫోన్‌ టారిఫ్‌లను ముఖేశ్‌ అంబానీ తెలియజేశారు. ఈ ఫోన్‌ ద్వారా జీవితకాలం పాటు ఉచిత వాయిస్‌ కాల్స్‌, అపరిమిత డేటాను అందిస్తున్నట్లు చెప్పారు. ఇందు కోసం నెలకు రూ. 153తో రీఛార్జ్‌ చేసుకుంటే సరిపోతుందని తెలిపారు.జియో యాప్స్‌ను కూడా ఇన్‌బిల్ట్‌ గా ఇచినట్లు పేర్కొన్నారు.

Related posts

Sensex plunges 792 pts, rupee hits 74/$ as RBI holds rates

admin

BMW Sports Motorcycle To Launch In India On 18 July 2018

Ashok prasad

Mobile number, Bank a/c must for pension scheme subscribers

admin

Leave a Comment